: శశికళ జైలు బయట అపార్టుమెంట్లో ఉన్నట్టు తెలిసింది.. ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడివుంటేనా?: డీఐజీ రూప


బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శశికళ ఉండటం లేదని, జైలుకు సమీపంలో ఉన్న ఓ లగ్జరీ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని, ఇటీవల జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ కు బదిలీ అయిన డీఐజీ రూప సంచలన విషయాన్ని బయటపెట్టారు. తమిళ పత్రిక 'తమిళ్‌ మురసు'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, అపార్టుమెంటు విషయం తనకు తెలిసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ వీలుపడలేదని అన్నారు.

ఆమె స్వయంగా పట్టుబడి వుంటే తాను తీసుకునే చర్యలు భయంకరంగా ఉండేవని అన్నారు. తన అరోపణలు రుజువైతే, శశికళకు ప్రస్తుతం విధించిన నాలుగేళ్ల శిక్షకు అదనంగా మరికొన్ని సంవత్సరాల శిక్ష తప్పదని అన్నారు. జైల్లో ఆమె ఒక్క పని కూడా చేయలేదని, యాపిల్ ఐ ఫోన్ వాడారని, ఒక్క రోజు కూడా జైలు ఆహారం తినలేదని ఆమె వెల్లడించారు. ఖైదీల యూనిఫాంను పక్కన బెట్టిన ఆమె, ఖరీదైన చీరలు, చుడీదార్లనే వాడినట్టు ఆరోపించారు. కాగా, గత వారం నుంచి శశికళకు కల్పించిన అదనపు సౌకర్యాలన్నీ తొలగిపోయినట్టు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News