: హత్య కేసులో సాక్ష్యం చెప్పిన చిలుక!


అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలో 2015లో ఓ హ‌త్య జ‌రిగింది. గ్లిన్నా దుర్గామ్‌ అనే మహిళ తన భర్త మార్టిన్‌ను తుపాకీతో ఐదుసార్లు కాల్చి హ‌త్య చేసింది. త‌న భార్య తుపాకీతో కాల్చుతున్న‌ప్పుడు మార్టిన్ త‌న‌ను చంపొద్దని వేడుకున్నాడు. త‌న భ‌ర్తను చంపిన త‌రువాత‌ గ్లిన్నా కూడా తుపాకీతో కాల్చుకుంది. అయితే ఆమె తలకు గాయమై ప్రాణాలతో బయటపడింది. ఈ ఘ‌ట‌న జ‌రుగుతున్న‌ప్పుడు వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్‌ గ్రే చిలుక ఆ దృశ్యాల‌న్నింటినీ చూసింది. ఎవరు ఏం మాట్లాడినా వెంటనే గ్రహించగల ఆ చిలుక ఈ కేసులో కీల‌క సాక్ష్యంగా మారింది. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన పోలీసుల ఎదుట ఆ చిలుక హత్య జరిగే ముందు విన్న త‌న య‌జ‌మాని మాట‌ల‌ను పలికింది. దీంతో గ్లిన్నా తానే తన భర్తను చంపిన‌ట్లు ఒప్పుకుంది. ఆగ‌స్టులో ఈ కేసులో ఆమెకు శిక్షను ఖ‌రారు చేస్తారు.     

  • Loading...

More Telugu News