: ఒక్కసారిగా కూలి పడ్డ కొబ్బరి చెట్టు.. ముంబాయ్ లో మాజీ యాంకర్ మృతి
మృత్యువు ఎప్పుడు, ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మాజీ యాంకర్‌పై ఒక్కసారిగా కొబ్బరిచెట్టు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ముంబయిలోని చెంబూర్‌లోని స్వస్తిక్ పార్కులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే... ఉదయం పూట దూరదర్శన్ మాజీ యాంకర్ కాంచన రఘునాథ్ (57) వాకింగు కోసం పార్కుకు వెళ్లారు. ఇదే సమయంలో ఓ కొబ్బరి చెట్టు కూలి ఆమెపై పడిపోయింది.
దీంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే ఆమెపై నుంచి కొబ్బరిచెట్టును తొలగించి ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ కొబ్బరి చెట్టును నరకడానికి బీఎంసీ సొసైటీకి అనుమతి ఇవ్వలేదని మృతురాలి భర్త రాజత్ నాథ్ అన్నారు.