: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల కేసులో పోలీసులు శరవేగంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు ఈ రోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులపై పోలీసులు మాట్లాడుతూ... నగరంలో డ్రగ్స్ విక్రయిస్తోన్న మహ్మద్ ఉస్మాన్, అర్నవ్ మండల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 20 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు ఇంకా విచారిస్తున్నారు. తరుణ్ రక్త నమూనా, తల వెంట్రుకలు, గోళ్లను ఉస్మానియా వైద్యులు సేకరించారు. ఈ కేసులో తరుణ్ పాత్ర ఎటువంటిదనే అంశంపై అధికారులు విచారిస్తున్నారు.