: 51 ఏళ్ల మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డిన నేరం కింద కేర‌ళ ఎమ్మెల్యే అరెస్టు


కేర‌ళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్‌ను 51 ఏళ్ల మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డిన నేరం కింద అరెస్ట్ చేశారు. అత్యాచారం త‌ర్వాత ఆమెను విన్సెంట్ మాన‌సికంగా వేధిస్తుండ‌టంతో ఆమె ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు కొల్లం సిటీ పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేర‌కు విన్సెంట్‌ను తిరువ‌నంత‌పురంలో అరెస్ట్ చేశారు. కోవ‌లం నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.విన్సెంట్‌పై ఐపీసీ 376 ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు కొల్లం సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ అజీతా బేగం తెలిపారు. ఎమ్మెల్యే త‌ర‌చుగా ఫోన్ చేసి, త‌న భార్య‌ను వేధిస్తుండే వాడ‌ని బాధితురాలి భ‌ర్త చెప్పాడు. బాధితురాలి ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ, ఇవ‌న్నీ ఆధారం లేని ఆరోప‌ణ‌లని, తాను విచార‌ణ‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు విన్సెంట్ వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News