: ముమైత్ ఖాన్ విచారణకు సర్వం సిద్ధం... బిగ్ బాస్ షో నుంచి సిట్ కార్యాలయానికి ముమైత్


టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ ను విచారించేందుకు సిట్ సర్వం సిద్ధం చేసింది. బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ ను విచారించడం ఎలా? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో... తనకు వచ్చిన నోటీసులను తీసుకుని ముమైత్ షాకిచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న ముమైత్ షో నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని, ఈ 27న విచారణకు హాజరుకానుంది. అయితే ఆమెను విచారించేది సిట్ కార్యాలయంలోనా? లేక మరెక్కడైనా? అన్న దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బిగ్ బాస్ షో ముంబై సమీపంలోని లోనావాలాలో ఉన్న బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News