: కంగ‌నాపై కామెంట్లకు క్ష‌మాప‌ణ‌లు కోరిన సైఫ్‌!


బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌ను హీరో సైఫ్ అలీ ఖాన్ క్ష‌మించ‌మ‌ని కోరాడు. ఐఫా 2017 వేడుక‌లో వ‌రుణ్ ధావ‌న్‌, క‌ర‌ణ్ జొహార్‌, సైఫ్ అలీఖాన్ సంభాష‌ణ‌లో భాగంగా కంగ‌నా ర‌నౌత్ మ‌న‌సు గాయ‌పడేలా మాట్లాడినందుకు వ్య‌క్తిగతంగా కంగ‌నాకు ఫోన్ చేసి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసిన‌ట్టు సైఫ్ చెప్పాడు. `నెపోటిజ‌మ్ (ఆశ్రిత పక్షపాతం)` ప‌దం చుట్టూ తిరిగిన వీరి వివాదం `కాఫీ విత్ క‌ర‌ణ్` షో నుంచి మొద‌లైంది.

బాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ల‌ను మాత్ర‌మే క‌ర‌ణ్ ప‌రిచ‌యం చేస్తాడ‌ని, ప‌రిశ్ర‌మ‌లో నెపోటిజంకు మారుపేరు క‌ర‌ణ్ అని `కాఫీ విత్ క‌ర‌ణ్‌` షోలో కంగ‌నా వ్యాఖ్యానించారు. దీనికి ప్ర‌తిగా ఐఫా 2017 వేడుక‌లో ఈ విష‌యం మీద జోకులు వేస్తూ కంగ‌నా మాట‌ల‌కు `నెపోటిజ‌మ్ రాక్స్‌` అంటూ సైఫ్‌, క‌ర‌ణ్‌, వ‌రుణ్‌లు కౌంట‌ర్ ఇచ్చారు. ఇది కాస్తా ఇంట‌ర్నెట్లో వివాదంగా మార‌డంతో ముందు వ‌రుణ్ ధావ‌న్‌, త‌ర్వాత సైఫ్‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

  • Loading...

More Telugu News