: హైదరాబాద్.. ఉడ్తా హైదరాబాద్ గా మారుతోంది: హీరోయిన్ స్నేహా ఉల్లాల్


హైదరాబాద్ నగరంలో నెలకొన్న డ్రగ్స్ సంస్కృతి పట్ల హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సిటీ ఉడ్తా హైదరాబాద్ లా మారిందని తెలిపింది. డ్రగ్స్ ను అరికట్టి, నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని చెప్పింది. డ్రగ్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెప్పిన ఈ భామ... వాటికి దూరంగా ఉండాలని సూచించింది. తాను కనీసం సిగరెట్ కూడా తాగనని...  స్మోక్ చేసేవాళ్లను ఎంకరేజ్ కూడా చేయనని చెప్పింది. మరోవైపు, ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది ఈ చిన్నది. 

  • Loading...

More Telugu News