: ఆకాశం నుంచి గుర్తు తెలియని సిగ్నల్స్... గ్రహాంతరవాసుల నుంచా?
ప్యూర్టోరికోలోని అరెచిబో అబ్జర్వేటరీలో పనిచేసే ఖగోళ శాస్త్రవేత్త అబెల్ మెండెజ్ గత రెండు నెలలుగా తమ టెలిస్కోప్‌కు అందిన గుర్తు తెలియని సిగ్నల్‌ను పరిశోధిస్తున్నారు. `మే నెలలో సుదూర విశ్వం నుంచి అరెచిబో శాటిలైట్‌కి ఒక సిగ్నల్ అందింది. అది భూమ్మీద జనించింది కాదు. కొన్ని పరిశోధనల తర్వాత అది భూమికి 11 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రోజ్ 128 అనే మరుగుజ్జు నక్షత్రం నుంచి వస్తున్నాయని తెలుసుకున్నాం` అని అమెల్ వివరించారు. సాధారణంగా అనంత విశ్వంలోని మరుగుజ్జు నక్షత్రాల నుంచి అందే సంకేతాలతో పోల్చినపుడు ఈ సిగ్నల్ కొంత విభిన్నంగా ఉండటం నిజమేనని... కాకపోతే సరైన రుజువు లేకుండా గ్రహాంతరవాసులే అని కచ్చితంగా చెప్పడం శాస్త్ర విరుద్ధమని అబెల్ తెలిపారు.
ఒకవేళ నిజంగా గ్రహాంతరవాసులే పంపించి ఉంటే వాళ్లు ఏం చెప్పాలనుకున్నారనే విషయాన్ని వీలైనంత త్వరగా కనిపెడతామని అబెల్ చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఉన్న అరెచిబో అబ్జర్వేటరీ నుంచి ఎలాంటి సంకేతం తప్పించుకోలేదని అబెల్ చమత్కరించారు. మరుగుజ్జు నక్షత్రాల నుంచి విడుదలయ్యే అతి తీవ్ర రేడియేషన్ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి సంకేతాలను టెలిస్కోప్ గుర్తిస్తుంటుంది. ఈ సంకేతాల జాడ కనుక్కోవడానికి అరెచిబో పరిశోధన కేంద్రం ప్రస్తుతం రోజ్ 128 చుట్టుపక్కల ఉన్న మరుగుజ్జు నక్షత్రాలను కూడా పరిశోధిస్తున్నారు.