: ఇద్దరు టీడీపీ నేతలకు చంద్రబాబు శుభవార్త!


ఇద్దరు టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ముఖ్యమంత్రి నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 280 జారీ అయింది. ఈ పదవిలో సోమిశెట్టి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు, మాజీ మంత్రి ఫరూక్ ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఫరూక్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలంటూ గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. 

  • Loading...

More Telugu News