: ఉదయం నుంచి సాయంత్రం వరకు సుబ్బరాజు నోరు విప్పలేదు... అకున్ సబర్వాల్ రాకతో సీన్ మొత్తం మారిపోయింది?


టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్ రాకెట్ లో సిట్ సుబ్బరాజును విచారించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 9:50 నిమిషాలకు సిట్ కార్యాలయానికి లాయర్ తో కలిసి చేరుకున్న సుబ్బరాజుకు సిట్ బృందం పలు ప్రశ్నలు సంధించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సుబ్బరాజు నుంచి వచ్చిన సమాధానం... 'నాకు తెలియదు... నాకు సంబంధం లేదు...ఏమో'... ఇదే వరస!  మధ్యాహ్నం లంచ్ తరువాత మరికొందరు అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినా సుబ్బరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. తనకు డ్రగ్స్ అలవాటు లేదనే తెలిపాడు. కావాలంటే పరీక్షలు చేసుకోవాలని సూచించాడు.

దీంతో ఇక లాభం లేదని సిట్ అధికారులు అకున్ సబర్వాల్ కు సమాచారం అందించడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. ఆయన రంగప్రవేశంతో విచారణ విధానం పూర్తిగా మారిపోయింది. పలు సాక్ష్యాలు చూపించి వాటిపై వివరణ అడిగారు. దీంతో సుబ్బరాజుకు సమాధానం చెప్పకతప్పలేదని, దీంతోనే ఆయన టాలీవుడ్ లో వేళ్లూనుకున్న డ్రగ్స్ గురించిన పలు వివరాలు అందించాడని తెలుస్తోంది. దీంతో పలు పబ్ ల యజమానులతో నేడు అకున్ సబర్వాల్ భేటీ కానున్నారు. 

  • Loading...

More Telugu News