: డ్రగ్స్ సరఫరా.. పోస్టల్ డిపార్ట్ మెంట్ రెడ్ అలర్ట్


పలు కొరియర్ సంస్థల నుంచే కాకుండా, పోస్టల్ సర్వీసు ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం సిట్ అధికారుల విచారణలో తేలిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోస్టుమాస్టర్ జనరల్ ను సంబంధిత అధికారులు అప్రమత్తం చేస్తూ ఓ లేఖ రాయడం జరిగింది. దీంతో, పోస్టల్ డిపార్ట్ మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లోని 109 పోస్టల్ డెలివరీ ఆఫీసులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు పోస్ట్ మాస్టర్ జనరల్ ఆదేశించారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటుడు సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సిట్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News