: పాజిటివ్ టాక్ తో ‘ఫిదా’ అయిన చిత్ర బృందం .. టపాసులు కాల్చిన సాయిపల్లవి-వరుణ్ తేజ్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్-సాయి పల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథా నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర బృందం ఫిదా అయిపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టపాసులు కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా, వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా టపాసులు కాల్చారు. సీమటపాకాయల పెద్ద దండకు వరుణ్ తేజ్, సాయిపల్లవి అగ్గిపుల్ల వెలిగిస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. దీంతో, ఈ వీడియోను చూసిన ‘మెగా’ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.