: పాప్ స్టార్ బీబర్ పై నిషేధం విధించిన చైనా!


పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకు గల కారణాలను వివరించింది. 2013లో చైనాలో షో నిర్వహించే నిమిత్తం బీబర్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో కొందరు అభిమానులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడనేది ఓ కారణం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ను సందర్శించేందుకు వెళ్లిన సమయంలో కూడా నాడు బీబర్ ప్రవర్తించిన తీరుపైనా ప్రభుత్వం మండిపడింది. బీబర్ తన బాడీగార్డుల భుజం పైకి ఎక్కి చైనా వాల్ వద్దకు మోసుకువెళ్లాల్సిందిగా ఆదేశించాడట. దీనిని రెండో కారణంగా చైనా ప్రభుత్వం చూపించింది. ఈ రెండు కారణాలతో బీబర్ ను తమ దేశంలో ఎలాంటి కచేరీలు చేయనివ్వకుండా నిషేధం విధించింది. కాగా, ప్రస్తుతం వరల్డ్ టూర్ లో భాగంగా బీబర్ తన షోలు నిర్వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News