: సుబ్బరాజు నుంచి రక్తనమూనాలను తీసుకుంటున్న నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో
టాలీవుడ్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10.30 నుంచి నటుడు సుబ్బరాజును అధికారులు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. సుబ్బరాజుపై సిట్ అధికారులు సుమారు ఏడు గంటల నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సుబ్బరాజుకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న విషయంపై అధికారులు ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో చేరుకుంది. సుబ్బరాజు రక్తనమూనాలను ఆ టీమ్ తీసుకుంటోంది. ఈ కేసులో మొన్న పూరీ జగన్నాథ్, నిన్న శ్యాం కె. నాయుడును అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.