: టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి కథ సుఖాంతం.. రేపటి నుంచి స్కూల్‌కి వెళుతుందన్న అధికారులు!
సీరియళ్ల ప్రభావంతో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమసాయి కథ సుఖాంతమైంది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పోలీసులు ఎట్టకేలకు ఆమె మనసుమార్చారు. తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లబోనని మొండికేసిన ఆ అమ్మాయిని ఒప్పించిన పోలీసులు కాచిగూడలోని బాలికల హోంలో తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఓ కారులో ఆమె తన తల్లిదండ్రులతో కలసి వెళ్లిపోయింది.
ఈ సందర్భంగా ఆమె తండ్రి అక్కడ అందరికీ స్వీట్లు ఇచ్చారు. తాను సీరియళ్ల ప్రభావంతో ముంబయికి వెళ్లలేదని, తన తల్లిదండ్రులకు కీడు జరుగుతుందని కల వచ్చినందుకే తాను అక్కడికి వెళ్లినట్లు ఆ బాలిక చెబుతోందని అన్నారు. రేపటి నుంచి ఆ అమ్మాయి స్కూలుకి వెళుతుందని కూడా అధికారులు చెప్పారు.