allu shirish: సూర్య పుట్టిన రోజున ఏం చేయాలో చెబుతున్న అల్లు శిరీష్!


తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతుంటాయి. ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టిన రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున అభిమానులంతా ఆయనది ఒకే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలని కోరుతూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు.

 ఈ మధ్య మలయాళంలో ఒక సినిమా చేసిన అల్లు శిరీష్ కి అది పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆయన కోలీవుడ్ ప్రేక్షకులకి చేరువ కావడానికి ట్రై చేస్తున్నాడట. సూర్యపై అభిమానాన్ని ప్రదర్శించడం .. సూర్య పుట్టినరోజున ఫ్యాన్స్ ఆయనది ఒకే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలని కోరడం అందులోని భాగమేనని చెప్పుకుంటున్నారు. ఆయన సూచనను సూర్య ఫ్యాన్స్ ఎంతవరకూ పాటిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అల్లు శిరీష్ .. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక సైన్టిఫిక్ థ్రిల్లర్ చేస్తోన్న సంగతి తెలిసిందే.      

allu shirish
  • Loading...

More Telugu News