amirkhan: ఫ్యామిలీతో విదేశాల్లో విహరిస్తోన్న అమీర్ ఖాన్!


బాలీవుడ్ అగ్రకథానాయకులలో అమీర్ ఖాన్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'దంగల్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందనేది తెలిసిందే. ఆ వెంటనే ఆయన 'థూగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే సినిమాతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకుంది. కొత్తరకం హెయిర్ స్టైల్ తో .. ముక్కుకి రింగ్ పెట్టుకుని మరీ ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

 కొన్ని వారాల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ఆయన .. భార్య కిరణ్ రావు .. తనయుడు ఆజాద్ రావ్ ఖాన్ తో కలిసి 'రోమ్' లో విహరిస్తున్నాడు. అక్కడి ప్రదేశాలను .. ప్రాచీన కట్టడాలను భార్యా బిడ్డలతో కలిసి వీక్షిస్తున్నాడు. వాళ్లతో సరదాగా సంతోషంగా గడుపుతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయి.    

  • Loading...

More Telugu News