: ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకునే వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలి: మంత్రి నారాయణ
ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకునే వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని వి.ఆర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మున్సిపల్ జూనియర్ కళాశాలను పరిశీలించిన నారాయణ.. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రభుత్వ విద్యను తాము బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు తాము ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతామని కోరుతోంటే అందుకు కొందరు అడ్డుపడటం సరికాదని వ్యాఖ్యానించారు. తెలుగుకు ప్రాధాన్యమిస్తూనే సర్కారు బడులు, కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నామని తెలిపారు.