: కంట తడిపెట్టిన ముఖేష్ అంబానీ తల్లి, భార్య!


రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. కంపెనీ సాధించిన విజయాలను వివరిస్తూ తన తండ్రి ధీరూభాయ్ అంబానీని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో, అక్కడే ఉన్న ఆయన తల్లి కోకిలా బెన్, సతీమణి నీతా అంబానీలు కంటతడి పెట్టుకున్నారు.

అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1977లో 3500 మంది ఉద్యోగులతో ఆవిర్భవించిన టక్స్ టైల్ సంస్థ నేడు ప్రపంచ వ్యాప్తంగా 2,50,000 మంది ఉద్యోగులతో ఉన్నతమైన సేవలను అందిస్తోందని ముఖేష్ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించినంత గొప్ప విజయాన్ని దేశంలో మరే సంస్థ సాధించలేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News