: తూర్పు చైనాలోని రెస్టారెంట్ లో భారీ పేలుడు!


తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న హాంగ్జూలో ఓ రెస్టారెంటులో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.35 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు సార్లు పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి రెస్టారెంటు కిటికీలు ఎగిరి దూరంగా పడ్డాయి. ఓ బస్సుపై శకలాలు పడటంతో, అందులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమీపంలోని కార్లు, టాక్సీలు, బస్సులు ధ్వంసమయ్యాయి. పక్కనున్న షాపులు కూడా ధ్వంసమయ్యాయి. అయితే, గ్యాస్ సిలిండర్ల వల్లే ఈ పేలుడు సంభవించినట్టు భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు వెనక ఇతర కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.  

  • Loading...

More Telugu News