: జియో ఉన్నంతకాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా తీసుకోను: ముఖేష్ కీలక ప్రకటన


రిలయన్స్ జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా వసూలు చేయబోనని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. వాటాదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన, జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని, ఇకపైనా అలాగే జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. అధునాతన సాంకేతికత దగ్గర చేస్తున్న సౌకర్యాలను తాను మారుమూల గ్రామాల ప్రజలకు అందిస్తానని స్పష్టం చేశారు. నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను తాము అందిస్తున్నామని, 65 కోట్ల వీడియో నిమిషాలను స్ట్రీమింగ్ చేస్తున్నామని ముఖేష్ పేర్కొన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను ఇండియా దాటేసిందని ప్రకటించేందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.

పది నెలల క్రితం జియో మార్కెట్లోకి రాకముందు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల విషయంలో 156వ స్థానంలో ఉన్న ఇండియా, ప్రస్తుతం తొలి స్థానానికి ఎదిగిందని ముఖేష్ ప్రకటించారు. జియో సేవలను అందుకుంటున్న వారు ఉచిత సేవలను మాత్రమే పొందుతారని, డేటాకు డబ్బుల వసూలు ప్రారంభిస్తే, జియో పతనమవుతుందని వచ్చిన ఊహాగానాలు తప్పని రుజువయ్యాయని చెప్పారు. మార్చి నుంచి డేటాకు నియమిత మొత్తాన్ని వసూలు చే్యడం ప్రారంభించిన తరువాత, అత్యధిక యూజర్లు పెయిడ్ కస్టమర్లుగా మారారని, ఇప్పుడు 10 కోట్లకు పైగా పెయిడ్ కస్టమర్లకు తాము సేవలందిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది తామందిస్తున్న రూ. 309 ప్లాన్ తీసుకుంటున్నారని తెలిపారు. జియో ప్రైమ్ సభ్యులకు ధన్ ధనాధన్ ప్లాన్ ను కొనసాగిస్తామని అన్నారు. ముఖేష్ అంబానీ ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News