: ఆ సమయంలో నేనేమీ న్యూడ్ గా లేను: హీరోయిన్ సంజన


'దండుపాళ్యం-2' చిత్రంలో సెన్సార్ కత్తెరకు గురైన ఇంటరాగేషన్ నగ్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న వేళ, ఆ సీన్ లో నటించిన హీరోయిన్ సంజనా గల్రానీ మరోసారి స్పందించింది. వీడియో విడుదలైన తరువాత, అది తనదేనని, ఆ దృశ్యాలు కూడా చిత్రంలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డ సంజన, ఇప్పుడు ఆ సీన్ తీసేటప్పుడు తాను నగ్నంగా ఏమీ లేనని చెప్పుకొచ్చింది.

తన శరీర భాగాలను ఓ టవల్ తో కప్పి ఆ దృశ్యాలు తీశారని, అందుకు సంబంధించిన ఫోటోలు తన వద్ద ఉన్నాయని, కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్ లను జోడించి నగ్నంగా ఉన్నట్టు కనిపించేలా మ్యాజిక్ చేశారని చెప్పింది. ఇక జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం వచ్చినా, తాను వంద శాతం నగ్నంగా నటించనని, తన పరిధులు తనకు తెలుసునని, భారత సంస్కృతి ఎంతో బలమైనదని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టింది సంజన.

  • Loading...

More Telugu News