: నటుడు సుబ్బరాజు ఇంటి వద్ద సెక్యూరిటీ వీరంగం!
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు సుబ్బరాజు నేడు ఎక్సైజ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆయన ఇంటి నుంచి బయల్దేరే సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని ఆయన ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో, అక్కడ మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం, సుబ్బరాజు తన వాహనంలో ఎక్సైజ్ కార్యాలయానికి బయల్దేరారు. అతన్ని మీడియా చుట్టుముట్టగా... మీడియాతో మాట్లాడటానికి ఆయన విముఖత వ్యక్తం చేశాడు. మీడియాతో మాట్లాడకుండానే వాహనాన్ని ముందుకు కదిలించాడు. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.