: హైదరాబాద్‌లో కలకలం... గోరింటాకు కోసం వెళ్లిన యువతి అదృశ్యం
హైదరాబాద్‌లోని డబీర్‌పురాలో 19 ఏళ్ల ఓ యువతి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. గోరింటాకు పెట్టుకుని వస్తానని చెప్పి, నిన్న రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన తమ కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన ఆమె కుటుంబ సభ్యులు డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి బీబీకా అలావా ప్రాంతానికి చెందిన సఫియా బేగం కూతురు సమీనా అని పోలీసులు తెలిపారు. సమీనా స్నేహితురాలి ఇంటి వద్దకి ఆమె రాలేదని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.