: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును స్వీకరించిన జయాబచ్చన్.. అభినందనలు తెలిపిన బిగ్ బీ!
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నాటి బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ లో ఈ రోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, జయాబచ్చన్ అవార్డు అందుకున్న విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. జయ అవార్డు అందుకోవడం తమకు గర్వకారణమని, ఆమెకు అభినందనలు చెబుతున్నవారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రతి సమావేశానికి హాజరవుతూ ఆమె తనకున్న అర్హతను నిరూపించుకుందని అమితాబ్ ప్రశంసించారు.