: కాంగ్రెస్ నేతలను తిట్టడం కేటీఆర్ కు అలవాటైపోయింది: వీహెచ్ మండిపాటు


తెలంగాణ డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్న కొందరికి టీఆర్ఎస్ నేతలతో స్నేహసంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ కు మతిభ్రమించిందని, రాజకీయాల నుంచి ఆయన రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఘాటుగా స్పందించారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను తిట్టడం కేటీఆర్ కు అలవాటై పోయిందని, డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పకుండా, దిగ్విజయ్ సింగ్ ను రిటైర్ కావాలని చెప్పడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాదు, డ్రగ్స్ తెలంగాణ అయ్యేట్టుందని, ఇప్పటికే తాగుబోతు తెలంగాణగా మారిందని వీహెచ్ తీవ్ర విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News