: మలయాళ నటి మంజూ దేశం విడిచి వెళ్లకూడదు: సిట్ అధికారుల ఆదేశం
ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్ మాజీ భార్య, నటి మంజూ వారియర్ దేశం వదిలి వెళ్లకూడదని సిట్ అధికారులు ఆదేశించారు. మంజు త్వరలోనే అమెరికాకు వెళ్లాలని అనుకుంది. అయితే, ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన సూచన మేరకు ఆమె తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చేవరకు ఆమె దేశంలోనే ఉండాలని పోలీసులు సూచించారు. అయితే, ఈ వార్తలను మంజు ప్రతినిధి ఖండించారు. ఆమె అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడానికి కారణం ఇది కాదని చెప్పారు. ప్రస్తుతం మంజు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వేధింపులకు గురైన నటికి మంజు మంచి స్నేహితురాలు.