: బాహుబలిలా సాహసం చేయాలనుకుని.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి!


జలపాతం వద్దకు చేరుకున్న ముంబైకి చెందిన ఓ వ్యాపారి అక్కడ విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. బాహుబలి సినిమాలో జలపాతం వద్ద హీరో ప్రభాస్ సాహసం చేసిన విధానాన్ని అనుకరిస్తూ ఇంద్రపాల్ పాటిల్ అనే వ్యక్తి ఓ పెద్ద బండరాయి పైకెక్కి జలపాతం అవతలి వైపునకు దూకడానికి ప్రయత్నించాడు. అయితే, తాను అనుకున్న విధంగా కాకుండా ఒక్క‌సారిగా ప్ర‌వాహంలో ప‌డి కొట్టుకుపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అత‌డి మృతదేహాన్ని గుర్తించారు.

అక్క‌డి ప్రాంతాల్లోకి వెళ్లకూడదంటూ హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయ‌ని, అయిన‌ప్ప‌టికీ వాటిని దాటి ఇటువంటి దుస్సాహ‌సాలు చేస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. బాహుబ‌లి సినిమాలో ఇటువంటి సాహ‌సం చేసిన‌ట్లు గ్రాఫిక్స్ సాయంతో చూపించార‌ని, నిజ జీవితంలో ఇటువంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవ‌లే అదే ప్రాంతంలో ఇటువంటిదే మ‌రో ఘ‌ట‌న కూడా చోటు చేసుకుంద‌ని వివ‌రించారు. 

  • Loading...

More Telugu News