: ప్రధాని వల్ల 'ఆకాశవాణి'కి పది కోట్ల ఆదాయం... `మన్ కీ బాత్` మ్యాజిక్!
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహిస్తున్న `మన్ కీ బాత్` కార్యక్రమం వల్ల ప్రజలు సరాసరి ఆయనతోనే మాట్లాడే అవకాశం కలగడమే కాదు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసే ఆకాశవాణికి కూడా లాభాలు తెచ్చిపెట్టింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు `మన్ కీ బాత్` కార్యక్రమం ద్వారా ఆకాశవాణికి రూ. 10 కోట్ల ఆదాయం సమకూరిందని సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. 2015-16లో రూ. 4.78 కోట్లు, అలాగే 2016-17లో రూ. 5.19 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు.