: బెంగళూరులో ఊపందుకున్న హిందీ, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమం


కర్ణాటకలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. కర్ణాటక రక్షణ వేదిక సంఘం సభ్యులు బెంగళూరులో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని యశ్వంత్ పూర్ మెట్రో స్టేషన్ ఎదుట ఉన్న సైన్ బోర్డుపై హిందీలో రాసి ఉన్న అక్షరాలపై నల్లటి రంగును పూశారు. ఇదే విధంగా మైసూరు రోడ్డు, దీపాంజలి నగర్, జయనగర్ లలో ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న సైన్ బోర్డులపై కూడా నల్ల రంగును పూశారు. బెంగళూరులోని ఓ మాల్ లో ఉన్న రెస్టారెంట్ ఎదురుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాసిన పేర్లపై కూడా నల్ల రంగును పూశారు. ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఈ సంఘానికి చెందిన కార్యకర్తలు హిందీ, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హిందీ, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. 

  • Loading...

More Telugu News