: షూటింగులో కంగనా రనౌత్ కు ప్రమాదం... తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు!
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ జాన్సీ' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో సాగుతున్న వేళ, పెను ప్రమాదం జరిగింది. ఓ సీన్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన చిత్ర సిబ్బంది సమీపంలోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఆమె కోలుకోవాలని ఆశిస్తున్నట్టు నిర్మాత కమల్ జైన్ వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన తరువాత ఆసుపత్రికి 30 నిమిషాల్లోనే తీసుకెళ్లామని, ఆ సమయంలో ఎంతో రక్తం కారుతున్నా, కంగనా రనౌత్ బాధను ఓర్చుకుని ధైర్యాన్ని చూపిందని అన్నారు.