: కమలహాసన్ తో డీల్ కుదుర్చుకున్న సచిన్ టెండూల్కర్
ప్రో కబడ్డీ లీగ్ లో తాను సొంతం చేసుకున్న 'తమిళ తలైవాస్'కు ప్రచారం నిర్వహించే నిమిత్తం విలక్షణ నటుడు కమలహాసన్ తో సచిన్ టెండూల్కర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా వెల్లడిస్తూ, తనకు కబడ్డీ ఆటతో అనుబంధం ఏర్పడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా తనను ఎంపిక చేయడం పట్ల సచిన్ కు కమల్ థ్యాంక్స్ చెప్పారు. 'ప్రియమైన తలైవాస్, గట్టిగా ఊపిరి పీల్చుకుని గీతను దాటండి. ఆటకు ఖ్యాతి తెండి' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తమిళ తలైవాస్ జట్టు జెర్సీని చెన్నైలో జరిగే ఓ కార్యక్రమంలో నేడు కమల్ ఆవిష్కరించనుండగా, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొననున్నారు.