: మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన పూరీ జగన్నాథ్!
డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణ ఎదుర్కొన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, మీడియాకు దొరకకుండా వెళ్లిపోయారు. విచారణ అనంతరం, పూరీతో మాట్లాడేందుకు మీడియా వేచి ఉన్నప్పటికీ, ఆయన మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం పూరీ జగన్నాథ్ తన కుమారుడు, సోదరుడితో కలిసి విచారణా కార్యాలయానికి హాజరయ్యారు. విచారణ అనంతరం ఈ ముగ్గురూ తమ వాహనంలో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, పూరీ జగన్నాథ్ నివాసం వద్ద కూడా మీడియా పడిగాపులు కాసింది. అయినప్పటికీ, మీడియాతో మాట్లాడేందుకు పూరీ ఆసక్తి కనపరచలేదు.