: ముంబైలోని ఓ సెలూన్ లో నానా హంగామా చేసిన బాలీవుడ్ హీరో కూతురు!
ముంబైలోని ఓ ఖరీదైన సెలూన్ కు వెళ్లిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నానా హంగామా సృష్టించింది. ఆ సమయంలో ఆమెతో పాటు తెలుగు చిత్రం ‘తూనీగ తూనీగ’ హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఉంది. సెలూన్ కు వెళ్లిన వీళ్లిద్దరూ, అక్కడి సేవలు పూర్తయిన తర్వాత, బిల్ చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్లారు. తమ వద్ద ఉన్న కార్డుల ద్వారా బిల్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, అందుకు అవకాశం లేదని కౌంటర్ లో చెప్పారు.
దీంతో, సెలూన్ సిబ్బందిపై వీరు మండిపడటమే కాకుండా, దురుసుగా వ్యవహరించారు. ఈ క్రమంలో సెలూన్ మేనేజర్ వచ్చి సర్దిచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయనపై కూడా నోరు పారేసుకున్నారు. తోటి కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుందని, ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వాళ్లకు పట్టలేదు సరికదా, మరింతగా రెచ్చిపోయారు. ఈ క్రమంలో బయటకు వస్తున్న వారిని తమ కెమెరాల్లో చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నించింది. దీంతో, తన ముఖాన్ని కనపడనీయకుండా చున్నీతో కప్పుకున్న సారా, కారులో ఎక్కి కూర్చుంది. అయినప్పటికీ, మీడియా ఆ ఫొటోలనే క్లిక్ మనిపించింది!