: ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి.. పారిపోయిన జంట
చిట్టీల పేరుతో రూ.ఆరు కోట్లు వసూలు చేసిన ఓ జంట చివరికి ఆ డబ్బుతో ఉడాయించిన ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని తిరుపాళయవనం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల పేర్లు ముత్తుకుమార్, ఆయన భార్య ప్రియగా వెల్లడించారు. వారు తమ బంధువు మేఘనాథన్ తో కలిసి పదేళ్లుగా చిట్టీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసి, ఇటీవల వారు పారిపోయారని చెప్పారు. ముత్తుకుమార్, ప్రియా తమ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని తేల్చారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.