: ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన అర్చకుడిపై వేటు


పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో శ్రీకుంకుమేశ్వరస్వామి ఆలయ అర్చకుడు కోమలపల్లి నాగభూషణ శర్మపై వేటు పడింది. ఈ మేరకు ఆయన్ని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఘటకు సంబంధించిన వివరాలు.. అదే ఆలయంలో పని చేస్తున్న ఈవో సులోచనను బదిలీ చేయాలంటూ ఎమ్మెల్యే సంతకాన్ని నాగభూషణ శర్మ ఫోర్జరీ చేస్తూ, దేవాదాయ శాఖ అధికారులకు లేఖ రాశారు. అయితే, ఈ లేఖ విషయాన్ని ఎమ్మెల్యే వద్ద సదరు ఈవో ప్రస్తావించడంతో అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో సదరు అర్చకుడిపై చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ఎమ్మెల్యే కోరడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News