: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మ‌రోసారి అగ్ర‌స్థానంలో టీమిండియా బౌల‌ర్‌


ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌల‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి స‌త్తాచాటాడు. 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ త‌రువాతి స్థానంలో శ్రీలంకకు చెందిన రంగన హెరాత్ నిలిచాడు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు రెండో స్థానంలో ఉన్న టీమిండియా బౌల‌ర్ అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇటీవ‌ల శ్రీలంక-జింబాబ్వే మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జ‌రిగింది. ఈ టెస్టులో హెరాత్ రాణించి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి ఏకంగా 11 వికెట్లను ప‌డ‌గొట్టాడు.

ఇక బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మొద‌టి ఐదు స్థానాల్లో వ‌రుస‌గా స్మిత్‌(941), రూట్‌(886), విలియమ్సన్‌(880), పుజారా(846), కోహ్లీ(818) ఉన్నారు. ఆల్‌రౌండర్స్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు ఆల్‌ హాసన్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా టీమిండియా ఆల్ రౌండ‌ర్లు జడేజా, అశ్విన్ ఆ త‌రువాతి స్థానాల్లో నిలిచారు.      

  • Loading...

More Telugu News