: సరిహద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ చేస్తోన్న సాధన... వీడియో చూడండి!
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఇటీవలే చైనా మిలటరీ డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టిబెట్‌లో చైనా భారీగా బలగాలను, మిలటరీ సామగ్రిని తరలించినట్లు అక్కడి మీడియా కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడి మీడియా తమ సోషల్ మీడియా సైట్లలో ఈ వీడియోలను ఉంచింది.
డోక్లాం భూభాగంలో చైనా రోడ్డు నిర్మిస్తే భారత్‌కు రక్షణ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఇండియా ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. చైనా కూడా మొండిగా వ్యవహరిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తోంది. యుద్ధానికి కూడా చైనా సన్నద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఆ దేశ సైనికులు చేస్తోన్న సాధన చూడండి...