nani: 'కృష్ణార్జున యుద్ధం' ప్యారిస్ నేపథ్యంలో వుంటుందట!


ఒక వైపున నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తుండగానే, ఆయన తదుపరి చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం' ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. పౌరాణిక చిత్రానికి సంబంధించిన ఈ టైటిల్ ను .. సాంఘిక చిత్రానికి ఖాయం చేయడం ఒక విశేషమైతే, ఈ సినిమాలో నాని కృష్ణ - అర్జున్ గా ద్విపాత్రాభినయం చేయనుండటం మరో విశేషం.

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ లో ఒక వైపున తిరుమలను .. మరో వైపున ప్యారిస్ ను చూపించారు. నాని పోషించే రెండు పాత్రల్లో ఒకటి తిరుమల నేపథ్యానికి సంబంధించినదైతే .. మరొకటి ప్యారిస్ కి సంబంధించినదిగా వుంటుందట. అందువలన ఎక్కువ భాగం షూటింగ్ ప్యారిస్ లో ఉంటుందని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.       

  • Loading...

More Telugu News