: ‘జై లవ కుశ’ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది: జూనియర్ ఎన్టీఆర్
బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఈ చిత్రం షూటింగ్ పూణెలో శరవేగంగా జరుగుతోందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. చాలా సమర్థవంతమైన చిత్ర బృందం ఈ సినిమాకు పని చేస్తోందని చెప్పాడు. ఈ ట్వీట్ తో పాటు 'జై లవ కుశ' చిత్ర షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఫొటోను తారక్ పోస్ట్ చేశాడు. కాగా, రాశీఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.