: పాటల కోసం బల్గేరియా వెళ్లిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ బల్గేరియా వెళ్లారు. త్రివిక్రమ్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఆయన తాజా చిత్రం నిన్నటి వరకు హైదరాబాద్ లో భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు 20 రోజుల పాటు బల్గేరియాలో షూటింగ్ జరుపుకోబోతోంది. బల్గేరియాలో పవన్ కల్యాణ్, హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లపై రెండు పాటలు షూట్ చేయనున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.