: హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ ను ఛేదించిన పోలీసులు.. 9 మంది అరెస్టు
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 300 గ్రాముల కొకైన్, 40 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎల్ఎస్డీ యూనిట్లు, కారు, ఎయిర్ గన్ ఉన్నాయి. ఈ ముఠా నుంచే విద్యాలయాలు, పబ్బులతో పాటు ప్రముఖులకి డ్రగ్స్ అందుతున్నాయి.