: స్క‌ర్ట్ వేసుకున్నందుకు అమ్మాయిని అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు!


ఎవ్వ‌రూలేని చోట ఓ యువతి స్క‌ర్ట్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసిన ఘ‌ట‌న‌ సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఆడ‌వారు సంప్ర‌దాయ దుస్తుల‌ను మాత్ర‌మే ధ‌రించాల‌ని, డ్రైవింగ్ కూడా చేయ‌కూడ‌ద‌ని సౌదీలో ఎన్నో ఆంక్ష‌లు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఈ యువ‌తి స్కర్ట్‌, క్రాప్‌టాప్‌ ధరించి వీధుల్లో తిరుగుతూ కన్పించింది. అంతేగాక‌, ఆమె అలా తిరుగుతుండ‌గా వీడియో కూడా తీసుకుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ శివారులోని చారిత్రక ఉషౌఖిర్‌లో ఆమె ఇలా చ‌క్క‌ర్లు కొట్టింద‌ని గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. త్వ‌ర‌లోనే న్యాయ‌స్థానంలో హాజరుపరచనున్నారు. కేవలం స్కర్టు వేసుకున్నందుకే పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.  

  • Loading...

More Telugu News