: క్రిస్ గేల్ చాలెంజ్ చేస్తే... 5 వేల డాలర్ల కోసం 'సై' అన్న సన్నీలియాన్
క్రికెట్ మైదానంలో తనకు ఉత్సాహం కలిగిన వేళ డ్యాన్సులు చేసే క్రిస్ గేల్, ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ, తనకన్నా బాగా నృత్యం చేస్తే 5 వేల డాలర్లను బహుమతిగా ఇస్తానని సవాల్ విసరగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ సై అంది. 'లైలా మై లైలా' పాటకు తాను నృత్యం చేసి, దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన గేల్ చాలెంజ్ విసిరాడు. ఇక దీన్ని చూసిన సన్నీ, తన నృత్యాన్ని నామినేట్ చేస్తున్నట్టు తెలుపుతూ, తన వీడియోను పోస్టు చేసింది. ఆపై గేల్ సమాధానం ఇస్తూ, 'నీ నృత్యాన్ని నేను చూశాను' అని రిప్లయ్ పెట్టాడు. ఇక సన్నీ నృత్యం గెలుస్తుందో... లేదో మరో వారంలో తెలిసిపోతుంది. క్రిస్ గేల్ డ్యాన్సును మీరూ చూడవచ్చు.