: 27 మంది పేర్లు వస్తే, మిగతా వారెక్కడ? వారిని ఎవరు దాస్తున్నారు?: సిట్ కార్యాలయం ముందు పూరీ అభిమానుల ఆందోళన


టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ దందా కేసులో విచారణ ప్రారంభమై, మొట్టమొదటగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, ఆయన అభిమానులు ఎక్సైజ్ కార్యాలయం ముందుకు భారీ ఎత్తున చేరుకున్నారు. వారు అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో పూరీ జగన్నాథ్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులో మొత్తం 27 మంది పేర్లు ఉన్నాయని స్వయంగా సిట్ అధికారులు చెప్పారని అంటూ, అయితే, 12 మందిని మాత్రమే విచారించడం ఏంటని ప్రశ్నించారు. మిగతా 15 మందిని సిట్ అధికారులు దాస్తున్నారా? ప్రొడ్యూసర్ల కౌన్సిల్ దాస్తోందా? అగ్ర నిర్మాతలు దాస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News