: ఆదాయపు పన్ను కట్టిన కేటీఆర్.. సంపాదన వివరాలు ఇవే!
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదాయపు పన్ను కట్టారు. మంత్రిగా తనకు వచ్చిన జీతాన్ని బట్టి ఆయన ట్యాక్స్ చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను కేటీఆర్ కు రూ. 7.22 లక్షల జీతం వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మంత్రి జీతభత్యాల నుంచి ట్యాక్స్ ను చెల్లిస్తున్నట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేరు మీద ఆదేశాలు వెలువడ్డాయి. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేటీఆర్ పన్ను చెల్లించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.