: పాక్ ఎంత వేగంగా స్పందించిందో..


జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో నిన్న పాక్ ఖైదీ సనావుల్లాపై సహచర భారతీయ ఖైదీ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెంటనే బాధ్యులైన జైలు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకుంది. భారత ఖైదీ సరబ్ జిత్ పై ఏప్రిల్ 26న పాక్ లోని లాహోర్ జైలులో తోటి ఖైదీలు దాడి చేశారు. ఆరు రోజుల పాటు ఆస్పత్రిలో చావు బతుకులతో పోరాడి సరబ్ ప్రాణం విడిచాడు.

ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. జైలు సూపరింటెండెంట్, అడిషనల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేస్తూ ఈ రోజు ఆదేశాలు వెలువరించింది. జమ్మూ ప్రభుత్వ చర్యలు అక్కడి పంజాబ్ ప్రభుత్వంలో కదలిక తెప్పించి ఉంటాయి. పరువు పోతుందనుకున్నారేమో.. ఇన్ని రోజుల తర్వాత బాధ్యులైన అధికారులపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది.

  • Loading...

More Telugu News