: ఆమిర్ ఖాన్‌కు చైనా బ‌హుమ‌తి... ప్ర‌శంసిస్తున్న భార‌తీయులు.. మీరూ చూడండి!


నిజజీవిత క‌థ‌తో తెరకెక్కించిన ఆమిర్ ఖాన్ `దంగ‌ల్‌` సినిమా భార‌తదేశంతో పాటు పొరుగు దేశం చైనాలో కూడా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఆమిర్ ఖాన్ అభిమానులు ఒక బ‌హుమ‌తి ఇచ్చారు. `దంగ‌ల్‌` సినిమాలోని `ధాక్క‌డ్ హై ధాక్క‌డ్‌` పాట‌కు డ్యాన్స్ వేసి, ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఈ వీడియోను చిత్రీక‌రించారు. డ్యాన్సింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేకుండా, 5 రోజులు క‌ష్ట‌ప‌డి తీసిన ఈ వీడియోను భార‌తీయులు తెగ మెచ్చుకుంటున్నారు. `ఇరు దేశాల ప్ర‌జ‌లు శాంతిని కోరుకుంటున్నారు. ఎలాంటి స‌రిహ‌ద్దు గొడ‌వ‌లు లేవు` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News