: పూరీ జగన్నాథ్ ను విచారించనున్న ముగ్గురు శ్రీనివాస్ లు!


సిట్ కార్యాలయానికి చేరుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ముగ్గురు అధికారులు విచారిస్తుండగా, వారందరి పేర్లూ శ్రీనివాస్ కావడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యేక విచారణ అధికారిగా నియమించబడ్డ మిర్యాలగూడ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావుతో పాటు ఎక్సైజ్ ఇనస్పెక్టర్లు శ్రీనివాస్, శ్రీనివాసరావులు పూరీని విచారించనున్నారు. ఇందుకోసం ఓ టేబుల్ ను సిద్ధం చేశారు. ఒకవైపు పూరీని కూర్చోబెట్టి, ఎదురుగా ఉన్న మూడు కుర్చీల్లో ముగ్గురు అధికారులూ కూర్చోని తమ ప్రశ్నలను సంధించనున్నారు.

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అవసరమైతేనే విచారణకు వచ్చి, తన సందేహాలను తీర్చుకుంటారని, ప్రత్యక్షంగా ఆయన ఎవరినీ విచారించబోరని సిట్ వర్గాలు వెల్లడించాయి. సిట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పూరీ విచారణ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News